TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ని 130 – సుభాష్ నగర్ డివిజన్, సూరారం కాలనీ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా శంభిపూర్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మి ప్రజలు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలను గెలిపించడం ద్వారా సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిందని ప్రజా సంక్షేమాలు అటకెక్కాయని తిరిగి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభమవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పాక్స్ చైర్మన్ ఎం. బాలరెడ్డి , సీనియర్ నాయకులు ex కార్పొరేటర్ సురేష్ రెడ్డి ,డివిజన్ మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS