
భారత సైన్యానికి వెన్నుదన్నుగా నిలుద్దాం…ఐకమత్యాన్ని చాటుదాం… ఉగ్రవాదం పై పోరాటం చేద్దాం: మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, ఎమ్మెల్యే మల్లారెడ్డి….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని “మల్లారెడ్డి హెల్త్ సిటీ” వారి అధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా జాతీయ సమగ్రతను చాటుతూ నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు , బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ… అమాయకులను చంపడం అనేది ఉగ్రవాద, ఉన్మాదానికి నిదర్శనమని, బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులను పెంచి పోషించి ప్రపంచ మానవాళికే పాకిస్తాన్ దేశం ప్రమాదకరంగా మారిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాలు ఏకమై పోరాటం చేయాలన్నారు..
ఇప్పటికే నాలుగు సార్లు పాకిస్థాన్ భారత్ తో యుద్ధానికి కాలు దువ్విందని, కానీ భారత సైన్యం దాటికి నిలవలేకపోయిందని, అయినా ఇంకా బుద్ధి రాలేదని, ప్రజాస్వామ్యంలో పాకిస్తాన్ కి విలువలేదని, ఆ దేశ ప్రజలే పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదాన్ని తన్నే దుస్థితికి పాకిస్తాన్ దిగజారిందన్నారు.
భారత సైన్యం అద్భుత ధైర్యసాహసాలతో పాకిస్తాన్ వణికిపోతుందని, ఈ యుద్ధంలో భారత సైన్యానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, బిఆర్ఎస్ నాయకులు, అభిమానులు, మల్లారెడ్డి హెల్త్ సిటీ యాజమాన్యం ప్రీతిరెడ్డి, ప్రొఫెసర్లు, డాక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
