TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్ కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక శ్రీ పంచముఖ అభయ ఆంజనేయస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని రానున్న పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్ కాలనీ లో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది అని, రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయి మద్దతు కాసాని జ్ఞానేశ్వర్ కి వుండాలని అని, వారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇద్దాం అని ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు,శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


TEJA NEWS