చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ మరియు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంశిగుడా పరిధిలోని సాయి చరణ్ కాలనీ, ఇందిరానగర్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి .డాక్టర్.జి రంజిత్ రెడ్డి కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ మరియు బస్తి కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…