TEJA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద 4 కోట్ల రూపాయల అంచనావ్యయంతో జరుగుతున్న నాల విస్తరణ పనులను,మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 4 కోట్ల రూపాయల నిధులతో బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను చేపట్టడం జరిగినది అని, పనులు తుది దశలో ఉన్నాయి అని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన చేపట్టాలని, త్వరలో నే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగవంతం పెంచాలని,పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని ,పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని, PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు. కల్వర్ట్ నిర్మాణము పై మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పై అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అని , ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు సాంత్వన చేకూరునని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

అదేవిధంగా
వర్షం పడుతున్న ప్రతి సారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు ,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని,ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చేపట్టడానికి గాను ,శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ మరియు బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామని, త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ముంపు సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
శేరిలింగంపల్లి లో అనేక రోడ్లు, లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు సుఖవంతమైన ట్రాఫిక్ రహిత సమాజాం కోసం కృషి చేశామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలకు అన్ని రకాల మౌళికవసతుల కల్పనకు కృషి చేస్తున్నాం అని, మౌళికవసతులు కల్పించడంలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తున్నాం అని, నాల విస్తరణ పనులు చేపట్టడం వలన వర్షాలకు పెద్దగా ఇబ్బంది ఏమి కలగలేదు అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE Gkd ప్రసాద్ , DE ఆనంద్, AE భాస్కర్, నాయకులు యాదగిరి గౌడ్, రవీందర్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS