ప్రాధాన్యత రంగాలకు రుణాలు మంజూర చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి.
- పంట రుణాలు లక్ష్యాన్ని సాధించినందుకు అభినందనలు .
- ఫ్రెండ్లీ ఫార్మర్ గా సేవలందించాలి.
: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.
సూర్యపేట జిల్లా : ప్రాధాన్యత కలిగిన రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి బ్యాంకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్వినందులాల్ పవర్ తెలిపారు శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన డిసిసి,డియల్అర్సి సమావేశానికి చైర్మన్గా జిల్లా కలెక్టర్ తేజస్, కన్వీనర్ గా లీడ్ బ్యాంకు మేనేజర్ చింతల బాపూజీ వ్యవహరించారు. ఈ సమావేశంలో వార్షిక ప్రణాళిక సంబంధించి ఉన్న 2024 -25 సంవత్సర లక్ష్యం 8994.16 కాగా రెండవ త్రైమాసానికి 5700.39 కోట్లు 63.38% లక్ష్యాలను సాధించారని ,వ్యవసాయ రుణాలకు గాను గ్రాఫ్ లోన్స్ 84.65% రేండవ త్రైమాసికంలో లక్ష్యం సాధించినదని. ఈ సంవత్సరానికి గాను 2942.48 కోట్లు లక్ష్యం కాగా రెండవ త్రైమాస్కానికి 2490.73 కోట్లు సాధించడం జరిగిందని దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు గాను 97. 13% సాధించడమైనదని సంవత్సర లక్ష్యానికి గాను 1004.8 కోట్లు లక్ష్యం కాగా 976 కోట్లు వ్యవసాయ రంగాలకు రుణాలు ఇవ్వడం జరిగిందని ldm తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు గాను రెండవ త్రైమాసికములు 62.17 శాతం పూర్తి చేశారని ఈ సంవత్సరం లక్ష్యం 7570.66 కోట్ల గాను 4706.62 కోట్లు ప్రాథమిక రంగాలకు రుణాలు అందజేశారని ldm పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యతరంగాలకు బ్యాంకర్లు అధికరణాలు ఇవ్వాలని జిల్లాలోని కొన్ని బ్యాంకులు తమ లక్ష్యాలను సాధించడంలో సహకరించడం లేదని వారి సహకారాన్ని పూర్తిగా అందించి లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ వీవి అప్పారావు మాట్లాడుతూ బ్యాంకర్లు మహిళా సంఘాలకు 3 51 కోట్ల 300 కోట్లు అందించారని పూర్తి సహకారం అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ 300 మంది లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకున్న గా 2 69 మందికి రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు డిటిడిఓ శంకర్ మాట్లాడుతూ 54 మంది ఎస్టి లబ్ధిదారులు రుణం కొరకు దరఖాస్తు చేసుకున్న గా 33 మందికి రుణాలు మంజూరు చేయడం జరిగిందని వివిధ కారణాలవల్ల 21 మంది పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఐ ఏజీఎం గౌతమి నవార్డు డిడియం సత్యనారాయణ ఎస్బిఐ ఆర్ఎం ఉపేంద్ర భాస్కర్ యూబీఐ డీజీఎం హనుమంత రెడ్డి డిఆర్డిఏ పిడి వివి అప్పారావు ఏ డి ఎస్ సి కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్ శంకర్ పరిశ్రమల శాఖ అధికారి సీతారాం నాయక్ జిల్లాలోని అన్ని బ్యాంకులు మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు.