TEJA NEWS

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ (సి ఈ ఐ ఆర్ )టెక్నాలజీతో సహాయంతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితుడికి అప్పగించిన సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వ రెడ్డి

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చింతమడక గ్రామానికి చెందిన కేమ్మసారం చంద్రం తన ఫోన్ పోగొట్టుకుని
పోలీస్ స్టేషన్ కు రాగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి, బ్లాక్ చేయడం జరిగింది. ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని బాధితుడికి ఫోన్ అందజేయడం జరిగింది.

ఎవరైతే ఫోన్ పోగొట్టుకుంటే మరియు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన (సి ఈ ఐ ఆర్ )సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు.


TEJA NEWS