TEJA NEWS

హైదరాబాద్:
ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడిది గెలుపంటే… మా నాయకుడిదే విజయం అంటూ… పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి.

పోలింగ్‌కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయా యులు… ఇప్పుడు మాదే గెలుపు… పందెమెంతో చెప్పు అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.

కూటమి, వైసీపీ నేతలపై బెట్టింగులు కాస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, చిత్తూరు జిల్లాలో బెట్టిం గులు జోరందుకున్నాయి. ఐపీఎల్ సీజన్‌లోనూ క్రికెట్‌ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

ఫలితాలకు ఇంకా 20 రోజుల సమయం ఉండ టంతో ఒకరినొకరు కవ్విం పులకు మొదలెట్టారు. బహిరంగంగానే పందెం కాస్తూ… బాండ్ పేపర్ రాసిస్తావా అంటూ మాటల యుద్ధం సైతం మొదలె ట్టారు.

కొన్ని నియోజకవర్గాల్లో గెలుపుపై పందేలు కాస్తుంటే… మరికొన్ని చోట్ల మెజారిటీపై పందెం వేసుకుంటున్నారు..


TEJA NEWS