TEJA NEWS

FIR పై స్పందించిన మద్దూరి

హైదరాబాద్:
జన్వాడ ఘటనపై రాజ్ పాకాల, ప్రధాన స్నేహి తుడు మద్దూరి విజయ్ FIR పై స్పందించారు. దీపావళి సందర్భంగా తన మిత్రుడు రాజ్ పాకాల ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి కుటుంబసభ్యులతో సహా వెళ్లానని.. కానీ.. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని… స్పష్టం చేశారు.

అయితే పోలీసులు తనపై అసత్యాలను ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు చేస్తున్న ఆరోపణలతో తీవ్ర మనో వేదన గురవుతున్నామని విజయ్ అన్నారు.

తన పేరుతో F.I.Rలో పెట్టిన ప్రతి వాక్యం తప్పేనని తాను చెప్పని మాటలు కూడా చెప్పినట్టు F.I.R లో రాశారని మద్దూరి విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

జన్వాడ ఫామ్‌హౌజ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మోకిల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో A1 గా రాజ్ పాకాలా.. A2గా విజయ్ మద్దూరి పేరులను చేర్చారు. మరోవైపు రాజ్‌పాకాలా ఇంట్లో మొదటి రోజు సోదాలు ముగిశాయి.

నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓరియన్ విల్లాస్‌లో విల్లా నంబర్ 5, 40, 43, లలో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు… 53 విదేశీ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.

49 స్కాచ్ బాటిల్స్.. 2 బీర్లు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే విదేశీ మద్యం దొరకడంతో.. 34(a), 34(1), 9(1) ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. అయితే.. విచారణ కొనసాగుతోందని.. పూర్తైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ డిసిపి దశరథ్ తెలిపారు.


TEJA NEWS