మంజీర రోడ్డు కు మహర్దశ
PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ప్రత్యేక చొరవతో నాడు రూ. 40 కోట్ల తో మంజీర మంచి నీటి నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగినది.
4 కోట్ల 31 లక్షల 50 వేల రూపాయల తో నూతనంగా సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ *
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు లో రూ. 4 కోట్ల 31 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే హఫీజ్పెట్ ఫ్లై ఓవర్ నుండి మై హోమ్ జ్యువెల్ వెనుక గేట్ వరకు గల మంజీర రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు మరియు రూ. 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మంజీర రోడ్డు సమస్య కు నేటితో పరిష్కారం లభించింది అని నాడు 40 కోట్ల రూపాయల తో మంజీర మంచి నీటి పైప్ లైన్ పునరుద్ధరించడం జరిగినది అని, పాత పైప్ లైన్ వలన లీకేజ్ ల వలన ప్రజలకు ఇబ్బందులు ఏర్పడినయి అని, మంచి నీరు వృధా కావడం వలన పాత పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగినది అని, సుమారు 7 Km ల మేర పైప్ లైన్ మార్చడం జరిగినది అని ,పైప్ లైన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రజల సౌకర్యార్థం 4 కోట్ల 31 లక్షల 50 వేల రూపాయల తో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, చుట్టూ పక్కల కాలనీల వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని PAC చైర్మన్ గాంధీ అన్నారు.
మంజీర రోడ్డు మరియు మైత్రి నగర్ ఫేస్ 3 కాలనీ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని , ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియచేసారు.
సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, హఫీజ్పెట్ డివిజన్ మరియు శేరిలింగంపల్లినియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE స్రవంతి ,AE ప్రతాప్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, MD ఇబ్రహీం మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.