
రజితను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య
అమీన్పూర్ లో ఓ కన్నతల్లి ముగ్గురు పిల్లలను చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. తన పిల్లల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా, తాను పిల్లల్ని బంగారం లాగా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని అన్నారు. తన భార్యను, శివను ఎన్కౌంటర్ను చేయాలని చెన్నయ్య వాపోయారు.మీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్లావణ్య కాపురం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్(8) ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెండ్లి చేసుకున్నాడు. రజితకు, చెన్నయ్యకు 20ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయితే ఆరు నెలల క్రితం జరిగిన పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో పరిచయం మరింతగా పెరిగింది. నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు.
