TEJA NEWS

యాదవ బంధుమిత్రుల. వన సమారాధన కార్యక్రమంను జయప్రదం చేయండి

-అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరిగే యాదవ కురుమ బంధుమిత్రుల వనభోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.
కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో జరిగిన యాదవ సభ్యుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ యాదవ మనసు మారధన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమదిగా భావించి విజయవంతం చేయాలని, ప్రకృతిని ఆస్వాదించడమే ప్రధాన ఉద్దేశంగా అన్ని కులాల భోజనాల కార్యక్రమం కార్తీక మాసంలో జరుగుతుందని, పురాణాల ప్రకారం అనాదిగా శ్రీకృష్ణుని ఆదేశానుసారం యాదవులు మొట్టమొదట వనభోజన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని,

దానిలో భాగంగా ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో ఈనెల 24న జరిగే యాదవ వన సమారాధన కార్యక్రమం వర్గాలు, పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున జరుగుతుందని తెలిపారు. , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ,అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐలబోయిన రమేష్ యాదవ్,గొర్ల యశ్వంత్ యాదవ్, కొమురెల్లి మల్లన్న దేవస్థానం మాజీ చైర్మన్ సంపత్ కురుమ మరియు యాదవ సంఘం జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు మరియు జిల్లాలోని యాదవ కులానికి కురుమ కులానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు డాక్టర్లు న్యాయవాదులు, తదితరులు భారీ ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల మల్లికార్జున యాదవ్, చింతల వెంకయ్య యాదవ్, అరిపిన్ని అశోక్ యాదవ్, అర్వలాల కృష్ణ, కేత బోయిన రాంబాబు అర్వసత్యం, అల్లిక బక్కయ్య, అరవ బాబు అరవ గంగయ్య,మరియు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS