నిండు ప్రాణం ఖరీదు పనేండు లక్షలు కట్టిన మేకిన్స్ లిమిటెడ్ కంపెనీ
పరిశ్రమలలో పని చేసే కార్మికుల ప్రాణాలకు విలువలేదు అని మరో సారి రుజువు అయింది అంటున్న కార్మికులు, బడా బడా పరిశ్రమలలో కార్మికులు పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసి తమ కుటుంబాలని పోషించుకుంటున్నారు, అయితే విషయానికి వస్తే మేకిన్స్ లిమిటెడ్ కంపెనీ గాంధీనగర్ లో పని చేసే ఒక కార్మికుడు కంపెనీలో ఆకస్మాత్తు పైన నుంచి పడిపోయాడు అని అతనిని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో చేర్చారు అని తరువాత కొద్ది సేపటికి అతడు మరణించాడు అని అతనిని హాస్పిటల్ మార్చురి లో పెడతాము అని తీసుకొని వెళ్లి అక్కడి నుంచి డెడ్ బాడీ ని మాయం చేసారు అని అతని బంధువులు నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ముందు రోడ్డు బ్లాక్ చేసి బైటయించారు దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటలు తరువాత పోలీస్ వాళ్ళు వారికి నచ్చ చెప్పి వారి ని అక్కడి నుంచి పంపారు అని,ఆ కార్మికుడి బంధువులు మాత్రం సెటిల్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని డెడ్ బాడీ ని అక్కడి నుంచి తరలిచారు అని ఆరోపించారు ,
మరుసటి రోజు జీడిమెట్ల లో మేకిన్స్ కంపెనీ మేనేజర్ మరియు వారి కార్మికుడి బంధువులు మధ్య కొంతమంది మధ్య వర్తుల సమక్షంలో ఆ కార్మికుడి కుటుంబానికి కేవలం పనేండు లక్షలు ఇచ్చారు అని సమాచారం, ఆ కార్మికుడి ప్రాణం విలువ ఆ కుటుంబం జీవితాంతం ఆ పనేండు లక్షలు తోనే బ్రతకాలి, మేకిన్స్ లిమిటెడ్ కంపెనీ ఒక ప్రాణం విలువ పనేండు లక్షలు మాత్రమే కట్టింది అంటున్నారు
కార్మికుల చట్టాలు ఎన్ని ఉన్న ఇవి బడా బాబులు మరియు బడా పరిశ్రమలకు వర్తించావా అని పలువురు నోళ్లు వెళ్ళ బేడుతున్నారు, కార్మిక సంఘాలు ఏమి చేస్తున్నాయి అని అవి కూడా వాళ్ళకి సలాం కొడుతున్నాయా అని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు, ఏది ఏమైన మరో కార్మికుడు బలి అయిపోయాడు అని కార్మికులు అంటున్నారు


