ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. రామగుండం అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష”

TEJA NEWS

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. రామగుండం అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష”….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
గోదావరిఖని, రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల వేగవంతమైన పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల లక్ష్యంగా రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సింగరేణి, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ సౌకర్యాలు, ప్రజలకు అవసరమైన ఇతర మౌలిక వసతులపై ఎమ్మెల్యే అధికారులతో విస్తృతంగా చర్చించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకత, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి, సౌకర్యాలు, పరిపాలన పరంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top