TEJA NEWS

జనగామకు ఐపీఎస్​ అధికారి
SHO గా చార్జి తీసుకున్న మనన్​ భట్ IPS..

ఇక నుంచి ట్రైనీగా జనగామలో సేవలు

జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ఐపీఎస్​ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. యూపీఎస్​సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా చాటిన మనన్​ భట్​ ట్రైనీ అధికారిగా జనగామలో అడుగు పెట్టారు.ఇక్కడ స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​గా ఆయన కొన్ని రోజులు సేవలందించనున్నారు.ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన చార్జి తీసుకున్నారు.చార్జి తీసుకునేందుకు వచ్చిన ఆయనకు జనగామ ఏసీపీ పార్థసారథి,సీఐ దామోదర్​రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.జమ్మూ కశ్మీర్​ రాష్ట్రం శ్రీనగర్​కు చెందిన భట్​ 2023 యూపీఎస్​సీ ఫలితాల్లో 88వ ర్యాంకు సాధించి ఆ రాష్ట్రంలో పాపులర్​ అయ్యారు.ఐఐటీ శ్రీనగర్​లో బ్యాచిలర్స్​ ఇన్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్స్​ పూర్తి చేశారు.ఆ తరువాత సివిల్స్​కు సన్నద్ధమైన భట్ 2023 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్​ అధికారి అయ్యారు. ఈయన 2021లో అసిస్టెంట్​ రిజిస్ట్రార్​గా కూడా ఉద్యోగం సాధించినట్లు తెలిసింది.


TEJA NEWS