TEJA NEWS

మరోసారి కన్నీళ్లతో మీడియా ముందుకు మంచు మనోజ్?

హైదరాబాద్:
మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గుర య్యారు. ఈ సందర్బంగా మీడి యా ముందుకు వచ్చిన మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.

నాన్న తరఫున జర్నలి స్టులకు క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అను కోలేదు. నాకోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది.

ఈ గొడవలో నా భార్య, కూతురి పేరు లాగుతు న్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బంధువుల కాళ్లు కూడా పట్టుకుంటానని చెప్పాను. అయినా వినడం లేదు. ఈరోజు సాయంత్రం అన్నీ చెప్పేస్తా’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనోజ్.

దీనికి గాను సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది. ఎలా జరిగింది. అన్న అన్ని విషయాలు చెప్పేస్తా అని చెప్పాడు మనోజ్. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.

గతకొంత కాలంగా మంచు ఫ్యామిలిలో గొడవలు జరుగుతున్న సంగతి తెల్సిందే. కానీ నిన్న రాత్రి నుండి ఈ గొడవలు తీవ్ర రూపం దాల్చాయి. మంగళవారం మంచు ఇంట హైడ్రామా నెలకొంది.


TEJA NEWS