హైదరాబాద్:మార్చి 09
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది.
ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డికి హస్తం పార్టీ చాన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 4న నోటిఫి కేషన్ జారీ కానుంది. మార్చి 11 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.. మార్చి 28న పోలింగ్ జరగనుండగా.. ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగనుంది.