మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి..
నంద్యాల
మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అంటూ నినదించారు.
ఈ క్రమంలో మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కింద పడిపోయారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.