TEJA NEWS

నీలాద్రీశ్వర ఆలయంలో మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు

ఉమ్మడి ఖమ్మం

పెనుబల్లి మండలంలోని నీలాద్రి గ్రామంలోని శ్రీ నీలాద్రీశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రెవెన్యూ , గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో మంత్రిని సత్కరించారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ తదితరులు ఉన్నారు.


TEJA NEWS