హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం, జలమండలి విభాగం అధికారులతో కలిసి కాలనీ లో పాదయాత్ర చేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినదుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అదేవిధంగా కాలనీ లో డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని, సీసీ రోడ్లు వేయాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని, ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకు రావడం జరిగినది.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు కాలనీ లో పాదయాత్ర చేయడం జరిగినది అని , ప్రశాంత్ నగర్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. త్వరలనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, UGD నిర్మాణం పనులు చేపడుతుమని డ్రైనేజి ఔట్ లెట్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, డ్రైనేజి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని, కాలనీ లో మంచి వాతావరణం కల్పిస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, వరద నీటి నిల్వ లేకుండా చూస్తామని ,సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు , మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని, డ్రైనేజి ఔట్ లెట్ సమస్యను త్వరలోనే పరిష్కరించాలని అధికారులకు తెలియచేసారు.
అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నాగప్రియ ,మేనేజర్ ప్రశాంతి మరియు GHMC AE రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్
మరియు నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.