తెలంగాణలో కన్నుల పండుగ గా మేరీ క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్ధీ పాలతో సర్వాంగ సుంద రంగా అలంకరించారు. రాత్రి9 గంటల నుంచి 12గంటల వరకు పలు కార్యక్రమాలు, సామూహిక ప్రార్థనలను చేపట్టారు.
ప్రత్యేక ప్రార్థనలతో రోజును ప్రారంభిస్తారు. పండగవేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చి లు యేసు నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పుర స్కరించుకుని పలువురు ప్రముఖులు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్రీస్తు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నా యి. మెదక్ చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు జరుగు తున్నాయి. తెల్లవారు జామున ప్రాతకాల ఆరా ధనతో వేడుకలు షురూ అయ్యాయి.
శతాబ్ది వేడుకల సందర్భం గా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుద్ధీ పాలతో చర్చి ప్రాకారాలను, టవర్ ను అందంగా ముస్తా బు చేశారు. చిన్నపిల్లలను ఆహ్లాదపరిచేలా చర్చి ఆవరణలో రంగులరట్నా న్ని ఏర్పాటు చేశారు.
ఇటు కరీంనగర్,పెద్దపల్లి, గోదావరిఖని, చర్చిలతో పాటు… హన్మకొండ లోని కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థనామందిరం ప్రార్థన లతో మారుమ్రోగింది. 30 ఏళ్ల క్రింద ఓ చిన్న పాకలో ప్రార్ధనలతో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించింది. నేడు అతిపెద్ద చర్చిలుగా అవతరించాయి.
ఇక క్రైస్తవులకు రాష్ట్ర గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు పలువురు మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఎప్ప టికీ ప్రపంచంలోని మాన వాళికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
యేసు ప్రభువు ఆదర్శా లను గౌరవించడానికి క్రిస్మస్ సంతోషకరమైన సందర్భమని,గవర్నర్ జిష్ణుదేవ వర్మ తెలిపారు.