TEJA NEWS

శంకర్‌పల్లిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

శంకర్పల్లి : శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం డియంఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో సత్యనిష్ట నెలకొనాలని సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం చేపట్టినట్లు తెలిపారు. వేద మంత్రోచ్చణల మధ్య సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి సామూహిక వ్రతంలో పాల్గొన్నారు.


TEJA NEWS