TEJA NEWS

రాయపర్తిలో భారీ దోపిడీ

  • ఎస్‌బీఐలోకి చొరబడిన దుండగులు
  • గ్యాస్‌కట్టర్‌తో స్ట్రాంగ్‌ రూమ్‌, సేఫ్టీ లాకర్లను తెరిచిన దొంగలు
  • ప్రజలు కుదువబెట్టిన బంగారం అపహరణ
  • వాటి విలువ దాదాపు రూ.14కోట్ల పైమాటేనని అంచనా
  • ఆధారాలు లేకుండా సీసీ కెమెరాల డీవీఆర్‌ ఎత్తుకెళ్లిన వైనం
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • వివరాలను గోప్యంగా ఉంచిన ఎస్‌బీఐ అధికారులు, పోలీసులు

అర్ధరాత్రి విద్యు త్‌ సరఫరా నిలిపివేసి, గ్యాస్‌ కట్ట ర్ల కిటికీ గ్రిల్స్‌ తొలగించి బ్యాంకులోకి చొరబడి రూ.కోట్ల విలువైన డబ్బులను కొల్లగొట్టే చోరీలను మనం చాలా సిని మాల్లో చూశాం. అదే రీతిలో వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సొత్తును అపహరించిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, బ్యాంకు అధికారులు చెప్పిన వివరాలతో పాటు విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇవీ.. రాయ పర్తి మండలకేంద్రం శివారులోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ తెరిచిన అధికారులు లోపలికి వెళ్లి చూసేసరికి లాకర్‌ రూం ఓపెన్‌ కావడం, అందు లోని సీక్రెట్‌ లాకర్‌ సైతం తీసి ఉండడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే ఎస్‌బీఐ ఉన్నతాధికారుల


TEJA NEWS