TEJA NEWS

జీ. దామోదర్ రెడ్డి, సీపీఐ
మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి

శ్రామికవర్గ చైతన్యానికి ప్రతిరూపం మేడే అని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. 138వ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తా, హెచ్ బీ కాలనీ, ఏ ఎస్ రావు నగర్, కుషాయిగూడ ప్రాంతాల్లో ఎర్రజెండాను దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ పూర్వ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎస్. శంకర్ రావు ఎగురవేశారు.

ఈ సందర్భంగా సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ‘నేను ఉరి తీయబడినంత మాత్రాన ఈ పోరాట అగ్నిజ్వాల అంతరించదు” అని “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అంటూ మార్క్స్ ఇచ్చిన నినాదాన్ని ఉరికంబమెక్కిన కార్మిక నాయకుడు అగస్ట్ స్పైస్ పునరుద్ఘాటించాడని వారు అన్నారు.అతని మరణం పీడిత, తాడిత జన శంఖారావమై విశ్వవ్యాప్తంగా మార్మోగిందని, ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అన్న కారల్ మర్క్స్ పోరు నినాదం శ్రామికుల చైతన్యాన్ని రగిల్చిందని అన్నారు. రోజుకి 16 గంటలు, 18 గంటలు పనిచేయలేమనే ఉద్యమానికి ఊపిరులూదిందని, అఖరికి పాలకవర్గాల మెడలు వంచేలా చేసి, శ్రమదోపిడీ, బానిసత్వం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేసిందని, ఇది పోరాటంగానే కాదు చికాగో అమరవీరుల సంస్మరణ దినంగా మేడే గా ప్రపంచ చరిత్రకెక్కిన దినంగా మారిందన్నారు. “మేడే” స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం, కార్మిక చట్టాలు, హక్కులను రక్షించుకోవాలన్నారు ఎం కార్మిక వర్గం ఐక్యతను మరింత బలపర్చాలని. మతోన్మాద, విచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.

ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా పూర్వ అధ్యక్షుడు ఎస్. శంకర్ రావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్, మతోన్మాద బీజేపీని 2024 పార్ల మెంట్ ఎన్నికల్లో ఓడించాల్సిన బాధ్యత కూడా కార్మికవర్గానిదే, కార్మికవర్గం ఇతర శ్రామికులను కలుపుకోని ఈ కర్తవ్యాన్ని నెరవెర్చాలని అన్నారు. ఈ పరిస్థితిలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడేకి మరింత ప్రాధాన్యత సంతరించుకున్నదని. “మేడే” స్ఫూర్తితో పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడానికి కార్మికులు ఒక్కరే కాకుండా రైతాంగం, వ్యవసాయ కార్మికుల్ని, ఉపాధ్యాయ, ఉద్యోగుల్ని కూడా ఉద్యమాలకు కదిలించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ నేతలు లక్ష్మీ నారాయణ, ఏం. నర్సింహా, మిరియాల సాయిలు, స్వామి దాస్, జాన్,కృపాకర్, నర్సింగ్ రావు, భిక్షపతి,సాయిలు,నర్సింహా రావు, ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS