గ్రామాలల్లో పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి
కమలాపూర్
మండల పరిషత్ అభివృద్ధి అధికారి ( ఎంపీడిఓ ) గుండె.బాబు డ్రై డే సందర్భంగా శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజు పల్లి గ్రామపంచాయతీలలో నిర్వహించే డ్రైడే ఏ విధంగా చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల లో తప్పనిసరిగా గ్రామపంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందితో గ్రామములోని ప్రతి ఇంటి ఇంటికి డ్రై డే పై అవగాహన కలిగించాలని, ప్రతీ ఇంటి యందు వారి ఇంటి పరిసరాల్లో ఏ వస్తువులో కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి చుట్టు పరిశుభ్రం చేసుకోవాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ సిబ్బందితో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో తప్పనిసరిగా ఆయిల్ బాల్స్ వేయించి దోమల నివారణకు బ్లీచింగ్, సున్నము మొదలైన వాటిని చల్లాలని , గ్రామంలో ప్రతి వాడవాడకు తప్పనిసరిగా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీ సెక్రటరీ డ్రై డే రోజు చేస్తున్న పనులన్నింటిని ఫోటోల రూపకంగా మండల పరిషత్ కార్యాలయానికి పంపించాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఈరోజు సందర్శనలో గ్రామ పంచాయతీల సెక్రటరీలు సాహితీ రెడ్డి, రాజకుమార్, ప్రవీణ్, , వైద్య సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాలల్లో పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…