TEJA NEWS

హైదరాబాద్‌: మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు దేవాదాయశాఖతో సంస్థ లాజిస్టిక్స్‌ విభాగం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో (లాజిస్టిక్స్‌) కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, బస్‌డిపోల పరిధిలో విధులు నిర్వహించే మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లనూ సంప్రదించవచ్చని సూచించింది. లాజిస్టిక్స్‌ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు పేటీఎం ఇన్‌సైడర్‌ పోర్టల్‌లో లేక ఆర్టీసీ యాప్‌లో ఈ నెల 14 నుంచి 25 వరకు మేడారం జాతర ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. పూర్తివివరాలకు 040 69440000 నంబర్‌లో సంప్రదించాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.


TEJA NEWS