TEJA NEWS

Medical personnel should provide better treatment to rural people

గ్రామీణ ప్రజలకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలి
ధరణి దరఖాస్తులను పరిష్కరించాలనిఅధికారులను ఆదేశించిన…….జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి*
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వనపర్తి:
గ్రామీణ ప్రజలకు వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
ఏ.ఎన్.ఎంలు, ఆశాలతో తరచూ సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యలు తెలుసుకొవాలని సూచించారు.
పెద్ద మందడి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారు. ఇన్ పేషంట్స్ ఎంతమంది అన్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. అత్యవసర మందుల నిల్వలు సరిగ్గా నిర్వహించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ల్యాబ్ లో చేస్తున్న పరీక్షలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల రిపోర్టులు సకాలంలో అందజేయాలని సూచించారు. ల్యాబ్ లో పరీక్షలు చేయు విధానాన్ని స్వయంగా పర్యవేక్షించారు. వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించాలని సూచించారు.

ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి

ధరణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయానికి సందర్శించారు. ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై ధరణిలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

డిప్యూటీ తహసీల్దార్ చక్రపాణి, ఎంపీడిఓ, వైద్య సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS