తిరుపతిలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

TEJA NEWS

తిరుపతిలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

** అంబరాన్నంటిన జనసేన సంబరాలు
తిరుపతి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో “పద్మ విభూషణ్” మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి (కొణిదల శివశంకర వరప్రసాద్) 70వ జన్మదిన వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు హాజరయ్యారు. మెగా అభిమానులు, జనశ్రేణులతో కలసి ఎమ్మెల్యే బర్త్ డే కేకును కట్ చేసి అన్నం వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు, నగర జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ.. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెగాస్టార్ పద్మ విభూషణ్ కొణిదల చిరంజీవి పై మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. మెగా కుటుంబం పై అభిమానులు చూపించే ప్రేమ, అనురాగాలే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాబ్జి, సుమన్ బాబు, మునస్వామి, రాజమోహన్, ఆనంద్, జీవకోన సుధా, లక్ష్మీపతి, హేమంత్, పురుషోత్తం, సాయి, ఆది, రమేష్ నాయుడు, సుమంత్, సుధాకర్, మధు, జీవన్, శ్రావణ్, అమృత, చందు, మార్కెట్ యువరాజ్, మాధవ రావు, వెంకటేష్, శేషాద్రి, జానకిరామ్, ప్రభాకర్ రెడ్డి, కిషోర్, ఉదయ్, కృష్ణ, పవన్, ముఖేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top