
మైలవరం లో ఘనంగా మినీ మహానాడు….
గజమాల తో ఎమ్మెల్యే కు స్వాగతం పలికిన… లంక లితీష్, తెలుగుదేశం కుటుంబ సభ్యులు…
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం
మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ వి ఎస్ కళ్యాణమంటపం లో మినీ మహానాడు కార్యక్రమం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు.మైలవరం తెలుగు యువత అధ్యక్షుడు లంక లితిష్ బైక్ ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి ఘన స్వాగతం పలికినారు.సభ ప్రాంగణం కి చేరుకున్న ఎమ్మెల్యే వసంత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మినీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు…
ఈ సందర్బంగా మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కార్యకర్తల ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దేశ ప్రజల కు చాటి చెప్పిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని,కార్యకర్తలతో బలంగా ఉన్నా పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు.కార్యకర్తలు క్రమశిక్షణ, చిత్త శుద్ధి కి మారు పేరు కలిగిన పార్టీ ఏదయినా ఉంది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అన్నారు…
అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ పేరు నలుదిశలా వ్యాపించేలా ప్రతి ఒక్క కార్యకర్త కలసి పని చెయ్యాలియని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమం లో టీడీపీ కుటుంబ సభ్యులు,నాయకులు, కార్యకర్తలు,పార్టీ అభిమానులు,తెలుగు యువత, అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
