TEJA NEWS

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇంటింటి ప్రచారంలో పాల్గోన్నారు

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ డివిజన్ లో ఇంటింటి ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి *కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * షేక్ పేట్ డివిజన్ లోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ జూబ్లీహిల్స్ ప్రజలతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలుపించుకోవాలని కోరారు..

ఈ ప్రచార కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, KSG అభిమానులు, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.