TEJA NEWS

కార్మిక వ్యతిరేక 4 కోడ్ లను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను పునరుద్దరించాలి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్. డీ యూసుఫ్ డిమాండ్.
….

    ఏఐటీయూసీ 106వ ఆవిర్భావదినోత్సవ సందర్బంగా జరిగిన పతా కవిష్కరణలు,ఊరేగింపు లో పాల్గొని ప్రసంగించిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్. డీ యూసుఫ్.  వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ 1920 వ సంవత్సరం లో ఆవిర్భావించిన తర్వాత నే కార్మిక చట్టాలు వచ్చాయనీ, 1921 లో ఫ్యాక్ట్రిస్ యాక్ట్ కు సవరణలు చేయించు కున్నాము, అలాగే 1923 లో కార్మిక నష్ట పరిహార చట్టం,1926లో ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1936లో వేతనాలచేల్లింపు చట్టం, 1946 ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ యాక్ట్(స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం, 1947 లో పారిశ్రామిక వివాదాల చట్టాలను బ్రిటిష్ వారి హయాంలోనే భారత కార్మికులకు ఏకైక సంఘం గా ఏఐటీయూసీ నిర్వహించిన పోరాటాల ద్వారా సాధించుకున్నాం.అలాగే బ్రిటిష్ హయాంలోనే 8గంటల పని దీన్నాన్ని సాధించుకున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన సంఘాలను కలుపుకొని మొత్తంగా 44చట్టాలను సాధించుకోవటం జరిగింది. ఈ చట్టాలను ఇంకా మెరుగు పర్చుకోవాలని, అసంఘాటీత కార్మికులకు చట్టాలు కావాలని పోరాటాలు నిర్వహిస్తుంటే, కేంద్రంలో పాలన చేస్తున్న మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ప్రభుత్వం, వ్యాపారాలు సులభంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా నడవాలంటే కార్మిక చట్టాలు అడ్డంగా ఉన్నాయని 44కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులకు వ్యతిరేకంగా వ్యాపారస్తులకు అనుకూలంగా 4లేబర్ కోడ్ లను తెచ్చారు. ఈ కోడ్ లు అమలైతే యూనియన్ పెట్టుకునే అవకాశం లేదు. భవిష్యత్తులో పర్మినెంట్ ఉద్యోగాలు వుండవు. కాలపరిమితితో కూడుకున్న ఉద్యోగాలకు అనుమతి ఇచ్చారు. పన్నెండు గంటలు పని చేయించుకోవచ్చు. యాజమాన్యాలు యూనియన్ లను గుర్తించాల్సిన అవసరం లేకుండా నిబంధనలు ఉన్నాయి. యూనియన్ గుర్తింపు పొందాలంటే 52% సభ్యత్వం ఉండాలి. కాంట్రాక్ లేబర్ ను విపరీతంగా నియమించుకోవచ్చు. ఇలాంటి అనేక కార్మిక వ్యతిరేక నిబంధనలతో కోడ్ లు ఉన్నాయి. ఈ కార్మిక వ్యతిరేక కోడ్ లను రద్దు చేసి, రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను పునరుద్దరిచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ పోరాటాలు నిర్వహిస్తుంది. కాంట్రక్ట్ లేబర్ విధానాలను రద్దు చేసి ఈ విధానం లో పనిచేస్తున్న కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుంది.  18 సంవత్సరాలనుండి కనీస వేతనాలు పెంచలేదు. వెంటనే కనీస వేతనాలు పెంచాలి. అసంఘాటీత రంగంలో పని చేస్తున్న హమాలీ, ఆటో, హకార్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటికరణ ను వెంటనే ఆపాలని, ఎల్. ఐ. సి. సొమ్మును అదాని కు దారాదత్తం చేయటన్ని ఖండించారు. 

.ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కె. స్వామి, ఉపాధ్యక్షలు ఇ. ఉమామహేష్ ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్, నియోజకవర్గం అధ్యక్షులు వి. హరినాధరావు లు ప్రసంగిస్తు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతన జి. ఓ లను విడుదల చేయాలని. కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఇ. వైస్. ఐ., పి. యఫ్. చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు కార్డుల పంపిణీలో జాప్యం జరగకుండా చూడాలని, భవన నిర్మాణ కార్మికుల కేసులను వెంటనే పరిష్కరించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పెన్షన్ విధాన్నాన్ని రద్దు చేసి పాత పెన్షన్ ను అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఈ రోజు నిర్వహించిన ఏఐటీయూసీ 106 ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జీడిమెట్ల ఈ.ఎస్.ఐ ఆసుపత్రి ఆవరణలో, ఉషోదయ టవర్స్ ఎదురుగా గల హమాలీ అడ్డా వద్ద, జీడిమెట్ల ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్. డీ. యూసుఫ్ పతకాలను ఆవిష్కరించారు. ఆర్. టీ. సీ. డిపో వద్ద జిల్లా అధ్యక్షులు కె. స్వామి, గుట్ట యార్డ్, ఐ.డీ.పీ. ఎల్ ఆటో అడ్డా వద్ద జిల్లా ఉపాధ్యక్షలు ఇ. ఉమా మహేష్, జగత్ గిరి గుట్టలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రత్నం, రంగారెడ్డి నగర్ భవన నిర్మాణ అడ్డా మరియు గాంధీ నగర్ ఏఐటీయూసీ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్, శ్రీనివాస్ నగర్, హమాలీ అడ్డా 3, మున్సిపల్ కార్యాలయం వద్ద నియోజకవర్గం అధ్యక్షులు వి. హరినాధ రావు, ప్రీమియర్ అలయిస్ కంపెనీ వద్ద దేవేందర్ ప్రసాద్, జి. ఆర్. పవర్ స్విచ్ గేర్ కంపెనీ వద్ద రమేష్ రెడ్డిలు పతాకవిష్కరణ చేసారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎమ్. నర్సింహా రెడ్డి, హమాలీ యూనియన్ నాయకులు సుంకి రెడ్డి, సీ. నర్సింలు, కె. మహేష్, బి నాగయ్య, బి. కనకయ్య, భవన నిర్మాణ సంఘం నాయకులు సామ్యూయెల్, మున్సిపల్ యూనియన్ నాయకురాలు టీ. కమల పాల్గొన్నారు.