TEJA NEWS

వరద బాధితులకు తోడుగా చంద్రన్న ప్రభుత్వం

ఆవుల వాసు

నెల్లూరువిడవలూరు మండలం, రామచంద్రపురం పంచాయతీ బుసగాడుపాళెం గ్రామంలోని యస్‌.టి. కాలనీలో మొంథా తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేయనుంది. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో నూనె, 1 కిలో ఎర్రగడ్డ, 1 కిలో ఉల్లిగడ్డలు, కిలో బంగాళాదుంప అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆవుల వాసు,ఆవుల రవీంద్ర, జేజి,చిన్నిబాబు,చిట్టిబాబు,పోలయ్య,బాబు,సోమయ్య,వెంకటేశ్వర్లు,గోవిందుస్వామి,శ్రీనివాసులు,యాదగిరి, నరసింహ,వెంకటేష్,రమేష్,నాగరాజు,వెంకటరమణ,ఆముదాల వెంకటేష్,బబ్బులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.