TEJA NEWS

Minister Jupalli calls for inspiration to achieve Ambedkar's ambition

అంబేద్కర్ ఆశయ సాధన కొరకు స్ఫూర్తి పొందాలని మంత్రి జూపల్లి పిలుపు
భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం…… ఎమ్మెల్యే మెగా రెడ్డి*

వనపర్తి జిల్లా
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ స్ఫూర్తిని పొందాలని రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
ఉదయం పెబ్బేరు మండలం సుగూరు గ్రామంలో డా. బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ చూస్తూ వారి ఆశయ సాధన కొరకు స్ఫూర్తి పొందాలని ప్రజలను సూచించారు. సమాజంలో గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధించడానికి విద్య ఒక్కటే మార్గమని చెప్పారు. పేదవారు సైతం ప్రైవేట్ స్కూల్ లో పిల్లలను చదివించి లక్షల రూపాయలు దారపోస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యమైన ఉపాద్యాయులు లేక నాణ్యమైన విద్య ఉండదని, అదే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉపాద్యాయులు ఉంటారన్నారు. పాఠశాలలకు అన్ని మౌలిక సదుపాయాలు సైతం సమకూర్చిన్నందున తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో నే చదివించి గొప్ప వారిని చేయాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ భావి తరాలకు ఎంకావాలో అవసరాలు ఉంటాయి అనేది అంబేద్కర్ ఆ రోజుల్లోనే తెలుసుకొని దానికి అనుగుణంగా రాజ్యాంగం రాశారని కొనియాడారు. సుగురు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
గ్రామానికి అవసరమైన మౌళిక వసతులు, నల్లవాగు చెరువు కట్ట పనులు, ఇతర సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అంతకు ముందు
జాతీయ రహదారి 44 నుండి వెంకటాపూర్ వెళ్ళే రహదారి వయా బునియాదిపూర్ హైలెవల్ వంతెనను మంత్రి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి , అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సం గంగ్వార్ ఇతర ప్రజాప్రినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
రూ. 2.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ వంతెన జాతీయ రహదారి నుండి 3/8 నుండి 3/10 మధ్యలో నిర్మించారు. జాతీయ రహదారి నుండి సుగురు, వెంకటాపూరు గ్రామాలకు వెళ్లేందుకు సౌకర్యం కలిగింది. ఫ్లడ్ డ్యామేజ్ పథకం కింద వంతెనను రోడ్లు భవనాలు శాఖ నిర్మాణం చేసింది.
అంతకుముందు పెబ్బేరు మండల అభివృద్ధి కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, శాదిముబారక్ చెక్కులను అందజేసారు.
పెబ్బేరు ఎంపిపి శైలజ, జడ్పీటీసీ పద్మా వెంకటేష్, ఎంపిపి భర్త కురుమూర్తి, సుగురు సర్పంచి వెంకటస్వామి, కొత్త సుగురు గ్రామ సర్పంచ్ వెంకటేష్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


TEJA NEWS