పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి తొలుత మధ్యాహ్నం 1:30 గంటలకు కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫoడ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఖమ్మం రూరల్ మండలం కొండాపురంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, సాయంత్రం 4:30 గంటలకు ఆరెంపులలో బీటీ రోడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు ఖమ్మం రూరల్ మండలం గూడూరు పాడులో హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు తనగంపాడు గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మంత్రి పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు