మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రతిఒక్క నాయకుడు మరియు కార్యకర్త ఒక సైనికునిలా పని చేయాలనీ దిశానిర్దేశం చేసి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కేయం ప్రతాప్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు నర్సారెడ్డి భూపతి రెడ్డి, జ్యోత్స్నా శివారెడ్డి, పున్నారెడ్డి , జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి , ఏ బ్లాక్, బి బ్లాక్ అధక్షులు మరియు డివిజన్ నాయకులు హాజరై దిశా నిర్దేశం చేయనున్నారు. కావున కాంగ్రెస్ సీనియర్ నాయకులు ,యువజన కాంగ్రెస్ నాయకులు ,మహిళా నాయకులు , మైనారిటీ నాయకులు, INTUC నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవమతం చేయగలరని కోరుతున్నాము.
మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…