TEJA NEWS

ప్రజా పాలన విజయోత్సవాల పేరిట ప్రజల సొమ్ము దుర్వినియోగం

ఏకకాలంలో రైతుల రెండు లక్షల రుణమాఫీ చేశారా…?

ప్రతి పేద మహిళలకు రూపాయలు 2500 ఇచ్చారా…?

ప్రతి నియోజకవర్గంలో ఒక స్టడీ సర్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని చెప్పారు మరి జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేశారని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ…

సంవత్సర కాలం పాటు సాగిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అంధకారంలోకి నెట్టబడిన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలకి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి నాంది పలికారు. ఎన్నికల సమయంలో మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో గడిచిన సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఎంత వరకు సఫలీకృతమయ్యారు అనేది ముందు తెలంగాణ ప్రజలకు చెప్పి ప్రజల పట్ల మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోగలరు,

జగిత్యాల నియోజకవర్గం లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు నేను కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం సృష్టికర్త అని చెప్పుకుంటారు కదా మరి ఎంతమందికి ఇచ్చారు తులం బంగారం…?

ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల నెరవేర్చినందుక విజయోత్సవాలు…?

గురుకుల పాఠశాలలో ఆహారాన్ని కలుషితం చేసి విద్యార్థుల ఊపిరి తీసుకున్నందుకు ఈ విజయోత్సవాల..?

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ చేయడంలో విఫలమైనందుకా ఈ విజయోత్సవాలు..?

హిందువుల ఆరాధ్య దేవి దేవతల పైన గుడుల పైన జరుగుతున్న దాడులకు ఈ విజయోత్సవాల…?

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం మాటలకే పరిమితమైంది.

చదువుకునే ప్రతి ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తానని నిరుద్యోగ భృతి రూ.4 వేలు అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని వాగ్దానాలు చేశారు మరియు ఏమయ్యాయి,

అంగన్వాడీ టీచర్లకు నెలకు వేతనం 18000 పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు అది ఏమైంది

జర్నలిస్టులో సహాయ నిధి కింద ఇస్తామా రూ.5 లక్షల నగదు మాటలకే పరిమితమైంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు కదా… ఏమైంది

సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తానన్నారు అది ఎంతవరకు అందించారు

ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా పెంపు హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.

రజకుల అభివృద్ధికి మరియు గొల్ల కురుమల ఇస్తామన్న ఆర్థిక సాయం చేస్తామన్న వాగ్దానం ఇంతవరకు నిలబెట్టుకోలేదు.

ఈ కార్యక్రమంలో మీటింగ్ ఇంచార్జ్ నలువాల తిరుపతి, కో-ఇంచార్జ్ కల్లెడ ధర్మపురి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ, జిల్లా ఆఫీస్ బేరర్ జుంబార్తి దివాకర్, బీర్పూర్ మండల అధ్యక్షులు ఆడెపు నర్సయ్య, అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, దీటి వెంకటేష్,శ్రీకాంత్(టిల్లు), కడార్ల లావణ్య మరియు జిల్లా మండల పదాధికారులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.


TEJA NEWS