కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ….
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు మండలం వెంకటాపూర్, గర్మిళ్లపల్లి గ్రామాలకు చెందిన 5గురు కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 5లక్షల 580రూపాయల విలువగల చెక్కులను అలాగే ఇద్దరు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 27వేల రూపాయల విలువగల చెక్కులను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ కనకదుర్గ కాలనిలోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.