TEJA NEWS

గజలక్ష్మి అమ్మవారి కటాక్షంతో అష్టైశ్వర్యాలు పొందాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

131 – సుభాష్ నగర్ డివిజన్ లిటిల్ స్టార్ స్కూల్స్ గ్రౌండ్ నందు ఒరిస్సా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గజలక్ష్మి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, రుద్రా అశోక్, నాయకులు సాంబయ్య, ఇస్మాయిల్, దుర్గారావు, మల్లేష్, రవికాంత్, కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు పంచు, తపన్, గౌతమ్ రాయి, నీలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS