పేదింటి మహాలక్ష్మిలకు వరం”కల్యాణ లక్ష్మి”పథకం: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై 23 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… ఆడపిల్లల పెళ్లి పుట్టినింటి వారికి భారం కాకూడదని ప్రభుత్వం అందజేస్తున్న కల్యాణ లక్ష్మీ / షాది ముబారక్ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఇంచార్జి మునిసిపల్ కమీషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, ఆర్ఐ నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.