గాయపడిన కాంగ్రెస్ నాయకుడికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతుల పరామర్శ….

TEJA NEWS

గాయపడిన కాంగ్రెస్ నాయకుడికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతుల పరామర్శ….

ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:కరీంనగర్,
పాలకుర్తి మండలం తక్కళ్లపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం సాయితిరుమల్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా గాయపడిన సాయితిరుమల్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడి, అత్యుత్తమ చికిత్స అందించాలని కోరారు.
ప్రమాదం నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే పరామర్శతో సాయితిరుమల్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top