TEJA NEWS

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
వనపర్తి నియోజకవర్గం
గోపాల్పేట మండల కేంద్రంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కేంద్రం వద్ద రైతులు సేద తీరేందుకు నీడ, నీరు ఏర్పాటు చేయాలన్నారు

తేమ శాతం వచ్చిన వెంటనే వడ్లను కొనుగోలు చేయాలంటూ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు

కార్యక్రమంలో తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఉమ్మడి, డిపిఎం భాష, గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్యశీలరెడ్డి, కోటిరెడ్డి, శివన్న, కొంకి వెంకటేష్, గోపాల్, రాజు, మహిళా సమైక్య సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు