TEJA NEWS

దిల్లీ: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 14న కవితను కోర్టులో హాజరు పర్చాలని ఆదేశించారు.
ప్రజ్వల్‌ రేవణ్ణ లాంటి వాళ్లను దేశం దాటించి.. తన లాంటి వారిని అరెస్టు చేయడం దారుణమని కవిత వ్యాఖ్యానించారు. మరోవైపు కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ·కూడా రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మార్చి 15న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.


TEJA NEWS