TEJA NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలి

పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి అనంద్ రావు

కరీంనగర్ మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పి ఆర్ యు టి ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ఆనంద్ రావు అన్నారు ఈ సందర్భంగా గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో గర్ల్స్ హై స్కూల్ వీక్లీ బజార్ పురాణిపేట్ పేట్ ధరూర్ కాలనీ ధరూర్ కేజీబీవీ గాంధీనగర్ హై స్కూల్, పోర్ట్, కాజీపూర్ హై స్కూల్ పాఠశాలలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 2018 నవంబర్ నుండి 2024 నవంబర్ వరకు ఆరు సంవత్సరాల్లో కనీసం మూడు సంవత్సరాలు ఉన్నత పాఠశాలలో బోధించి ఉండాలని వారు తెలిపారు నవంబర్ ఆరో తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు

ప్రతి ఉపాధ్యాయుడు విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని కరీంనగర్ మెదక్ అదిలాబాద్ నిజామాబాద్ ఉపాధ్యాయ పి ఆర్ టి యు టి ఎస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా 2024 డీఎస్సీ ద్వారా నియామకమైన నూతన ఉపాధ్యాయులను పి ఆర్ టి ఎస్ లో సభ్యత నమోదు చేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు విద్యాదేవి ప్రధాన కార్యదర్శి పద్మ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జమున రాష్ట్ర ఉపాధ్యక్షులు చందన రజిత జిల్లా ఉపాధ్యక్షులు శ్రీదేవి షఫీ ప్రవీణ్ మీర్జా అబ్దుల్లా బేగ్ రాజేష్ బసిత్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS