ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు: లాలూ RJD చీఫ్, బిహార్ మాజీ CM లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టులోపు కేంద్రంలో NDA ప్రభుత్వం కూలిపోవచ్చన్నారు. ‘మోదీ ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చు.
పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి’ అని RJD వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 240 స్థానాలకే పరిమితమైన BJP.. TDP, JDU తదితర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.