దేశ విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తున్న మోదీ.

దేశ విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తున్న మోదీ.

TEJA NEWS

  • దేశ విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తున్న మోదీ.*
    జిల్లాలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం*
  • వనపర్తి .:
  • దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బందు పిలుపులో భాగంగా జిల్లాలో ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రాజీవ్ చౌరస్తాలో విద్యార్థులతో బయటయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.ఆది,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేష్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు వెంకటేష్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు చరణ్ మాట్లాడుతూ… దేశంలో మోదీ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని ,పేపర్ లీకులు, స్కామ్ల్ ,పరీక్షలు రద్దు ద్వారా దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పరువు తీశారని నీట్ పేపర్ లీకైందనే నిజాలను బీహార్ ఎర్పాటు చేసిన సిట్ తెల్చిందని ,లీకైనట్లు నిందితులు అంగీకరించిన తర్వాత కూడా కేంద్రం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
  • కేవలం గ్రేస్ స్కోర్ కార్డు రద్దు చేసి వారికి పరీక్ష నిర్వహించి దీని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. నీట్ పరీక్ష తో పాటు నెట్, నెట్ సిఐఎస్సిఆర్ పరీక్షలు రద్దుచేశారంటేనే విద్యా విధానం పట్ల చిత్తశుద్ధి అర్ధం అవుతోంది అని తెలిపారు. దేశంలో నూతన విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.
  • మన రాష్ట్రంలో కూడా నీట్ లీకేజీ వల్లన విద్యార్థులు ర్యాంకులు మారి గందరగోళం ఏర్పడింది అని ,అత్యున్నత వైద్య విద్య అమ్మకానికి పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కూడా ప్రైవేట్, కార్పోరేట్ ఫీజులు దందా నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్,జిల్లా కమిటీ సభ్యులు భరత్,సాయి ,మహేష్ ,వెంకటేష్,రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశీ పిడిఎస్యు నాయకులు రమేష్,ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు చరణ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి