TEJA NEWS

యోగాకు గుర్తింపు మోదీ చలవే
** యోగా దినోత్సవంలో స్విమ్స్ డైరెక్టర్

తిరుపతి: ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న యోగాకు ఇంత స్థాయిలో గుర్తింపు రావడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ 2014 సం.లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తీసుకున్న చలవే కారణమని తిరుపతిలోని
శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ తెలిపారు. స్విమ్స్ మెడికల్ యూనివర్శీటీ – సిద్ద క్లినికల్ రీసెర్చ్ యూనిట్ తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్లే గ్రౌండ్ లో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వాహించారు. డాక్టర్లు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఉద్యోగులతో కలసి డైరెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ… 2014 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదిన యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం థీమ్ “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” అనే నినాదంతో జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన మన దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృడంగా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. యోగా ఆరోగ్యానికి దివ్యౌషదం అని, అని వర్గాల వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, మానసిక ఒత్తిడిని జయించేందుకు యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందుతారని, అలాగే యోగా చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో చాలా సహాయపడుతుందని, రోజు యోగా చేయడం వల్ల ఊపిరితిత్తులు మెరుగుపడడమే కాకుండా ఆస్థమా లక్షణాలు కూడా తగ్గుతాయని, ప్రతి రోజు యోగా చేయడం ద్వారా బాడీ ఫిట్ గా వుంటుందని తెలిపారు. చివరగా స్విమ్స్ డైరెక్టర్… సిద్ద రీసెర్చ్ క్లినిక్ యూనిట్ డా.సామ్రాజ్ యోగా చేసిన విద్యార్థులకు యోగా మ్యాట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, రిజిస్ట్రార్ డా.అపర్ణ ఆర్ బిట్లా, కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డా.వనజాక్షమ్మ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా.ముక్తేశ్వరయ్య, ఫిజియోథెరపీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. మాధవి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. సుధారాణి, అలైడ్ హెల్త్ సైన్స్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుబాబు, యోగా కో-ఆర్డినేటర్ డా.శర్వాణి, డా.విశ్వేశ్వర రావు, డా.రవీంద్ర కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రమరెడ్డి, ఎడి(పి.ఆర్)
వి.రాజశేఖర్, బాబు సురేష్, నెట్ వర్క్ ఇంజనీర్ ప్రణయ తేజ, బెనర్జీతో పాటు, స్విమ్స్ ఫ్యాకల్టీ, ఎం.బి.బిఎస్, శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల, ఫిజియోథెరపి, నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్స్స్ కళాశాల విద్యార్థినీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.