
ఆధ్యాత్మికత పెంచేలా నగర సంకీర్తన
తిరుపతి: ప్రతి ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మార్మోగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. వందమందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకే సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తు నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి అన్నూరు, మునిరత్నమాచారి, వెంకటాచలం, బ్రహ్మానందం, పద్మావతి, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, అరుణ, యశస్విని, జయమ్మ, పార్వతి, మునేంద్ర రెడ్డి, కోటి, ముని కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రెడ్డి బాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు.
