TEJA NEWS

విద్యార్థుల్లో యోగా స్ఫూర్తి నింపాలి

** చంద్రగిరి బీజేపీ ఇన్ చార్జి మేడసాని

చంద్రగిరి: ప్రతిఒక్కరికీ ఆరోగ్యాన్ని ప్రసాధించే యోగా స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపాలని చంద్రగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి మేడసాని పురుషోత్తం నాయుడు కోరారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చంద్రగిరి శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థినులతో కలిసి మేడసాని యోగ కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు మేడసాని అన్నపూర్ణ, చంద్రగిరి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దేవర మనోహర్, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి శానంభట్ల ముని లక్ష్మమ్మ, రామచంద్రాపురం మండల ఇంచార్జ్ శంకర్ రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి, చంద్రగిరి మండల బిజెపి సీనియర్ నాయకులు రాజేంద్రప్రసాద్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడసాని
పురుషోత్తమ నాయుడు
మాట్లాడుతూ స్కూళ్లలో ఇంతకుముందు సపరేట్ గా ప్రతిరోజూ డ్రిల్ పీరియడ్ అమలు చేస్తూ విద్యార్థులను వివిధ ఆటలు పాటలతో వ్యాయామం నేర్పించేవారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పోటీ ప్రపంచంలో నిరంతరం చదువు, ర్యాంకులు, పోటీ పరీక్షలు అంటూ పిల్లల్లో వ్యాయామ శిక్షణ కనుమరుగై పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మన ప్రధాని మోదీ రూపంలో దేశం మొత్తానికి యోగా మళ్ళీ ప్రారంభం కావడం ఆరోగ్య సమాజానికి నాంది కలిగిందన్నారు.