TEJA NEWS

రిల్ హీరో కాదు రియల్ హీరో: మోహన్ లాల్

కేరళ
రిల్ హీరో అంటే సినిమాల్లో హీరోయిన్ క‌ష్టాల్లో ఉంటే గూండాలతో ఫైట్ చేసి ఆమెను కాపాడుతాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ వంద లాది మంది ప్రాణాలను కాపాడడానికి వచ్చి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు కేర‌ళ న‌టుడు మోహ‌న్‌ లాల్‌.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో మోహ‌న్‌లాల్‌పై ఇలాంటి ప్ర‌శ‌సంలే కురుస్తున్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఏం చేశా రంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిం దే. ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాల కార‌ణంగా వ‌య‌ నాడ్‌లో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌కృతి వైప‌రీత్యాన్ని కొండ చెరియ‌లు విరిగిప‌డ్డాయి, ఇళ్లు, చెట్లు నేల మ‌ట్టాయి. వేలాది మంది స‌ర్వ‌స్వం కోల్పోయారు. దీంతో వీరిని అండ‌గా నిలిచేందుకు ఆర్మీ రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆర్మీతో క‌లిసి రెస్యూ ఆప‌రే ష‌న్‌లో భాగమ‌య్యారు హీరో మోహ‌న్‌లాల్‌.

స్వ‌యంగా గ్రౌండ్‌లోకి దిగి గౌర‌వ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హోదాలో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. ఇప్ప‌ టికే సీఎం స‌హాయ నిధికి రూ. 25 ల‌క్ష‌ల విరాళం అందించిన మోహ‌న్‌లాల్‌, తాజాగా స్వ‌యంగా రంగంలోకి దిగారు.

కోజికోడ్‌ నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్‌కి వచ్చిన మోహన్‌లాల్‌… ఆర్మీ బేస్‌ క్యాంప్‌లో సైనికులను కలిశారు. ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

తాత్కాలిక బ్రిడ్జ్‌ల నిర్మాణం, బాధితులకు సహాయం చేయడంలో పాలుపంచు కున్నారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ లాల్ మాట్లాడుతూ..

దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వయనాడ్‌ విధ్వంసం ఒకటన్నారు. సంఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చి చూస్తే ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్ధమైందన్నారు.


TEJA NEWS