ఓటర్ లిస్ట్ జాబితా పై సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ వెంకయ్య గౌడ్
శంకర్‌పల్లి :శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య గౌడ్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో పొలిటికల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఓటర్ లిస్టు జాబితాలో మార్పుల చేర్పుల విషయంపై సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ ఈనెల 30వ తేదీన ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాలలో చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ సురేష్, బిజెపి తరపున బండమీది వెంకన్న, కాంగ్రెస్ తరపున పొడవు శ్రీనివాస్, సిపిఎం తరపున మల్లేష్, సిపిఐ తరఫున చంద్రయ్య పాల్గొన్నారు.